రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హరితహారం పురోగతిపై శుక్రవారం బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలు మరియు పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించారు. హరితహారం కార్యక్రమమునకు సంబంధించిన మొక్కలు, ఇతర సామాగ్రి పంపిణీకి అందుబాటులో వుంచినట్లు అధికారులు ప్రధాన కార్యదర్శికి వివరించారు.
ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సి.యం ఓఎస్డి ప్రియాంక వర్గీస్ , అటవీ శాఖ పిసిసిఎఫ్ శోభ, PCCF (SF) డోబ్రియల్ తదితర అధికారులు పాల్గొన్నారు.