Sunday, January 19, 2025
HomeTrending NewsAICC: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశ నిర్దేశం

AICC: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశ నిర్దేశం

న్యూఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణపై సమావేశ జరుగుతోంది. ఈ సమావేశంలో జనరల్ సెక్రెటరీ(ORG ) KC వేణుగోపాల్, ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మనిక్ రావు థాక్రేతో పాటు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపీలు ఉత్తమ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు ఏఐసీసీ సెక్రెటరీ ,మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మక సమావేశంలో వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై జాతీయ నేతలు దిశ నిర్దేశం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర నేతలు కుమ్ములాటలతో పరస్పర ఆరోపణలు మానుకోవాలని స్పష్టంగా సూచించారు. పార్టీ నేతల కుమ్ములాటలతో ప్రజల్లో అయోమయం సృష్టించవద్దని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్