Sunday, January 19, 2025
Homeతెలంగాణబెడ్ ఖరారైతే అడ్డుకోవడంలేదు: డిహెచ్

బెడ్ ఖరారైతే అడ్డుకోవడంలేదు: డిహెచ్

హైదరాబాద్ ఆస్పత్రుల్లో బెడ్ ఖరారు అయిన పేషంట్లను ఎక్కడా అడ్డుకోవడంలేదని ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం  చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పేషెంట్ల విషయంలో ఒక స్పష్టమైన విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. కోవిడ్ రోగులు అక్కడ బయల్దేరేముందే ఆస్పత్రుల్లో బెడ్ కేటాయింపు నిర్దారించుకోవాలని, ఆయా ఆస్పత్రులు కోవిడ్ కంట్రోల్ సెంటర్ కు ప్రోఫార్మాలో పేషంట్ వివరాలు నమోదు చేస్తారని చెప్పారు, అలంటి పేషంట్లను అనుమతిస్తున్నామన్నారు. .

ఇది ఒక్క ఆంధ్ర ప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే కాదని అన్నిసరిహద్దు రాష్ట్రాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని, ఈ విషయమై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మన సిఎస్ లేఖ రాశారని చెప్పారు.

కొంతమంది పేషంట్లు బెడ్ ఖరారు కాకపోయినా ఇక్కడకు వచ్చి ఆస్పత్రుల చుట్టూ తిరిగి ప్రాణాలు కోల్పోతున్నారని, ఆ తరువాత బంధువులు శవాలు ఇక్కడే వదిలేసి వెళ్తున్నారని శ్రీనివాస రావు వివరించారు. తెలంగాణాలో చికిత్స పొందుతున్న వారిలో 40 శాతం ఇతర రాష్ట్రాల పేషెంట్లు ఉన్నారన్నారు.

అక్సిజన్, రెమిడిసివర్ లాంటి మందులు కేంద్రం పరిమిత సంఖ్యలో సరఫరా చేస్తోందని, కాని ఇతర రాష్ట్రాల పేషెంట్లకు ఇవి వినియోగిస్తే ఇక్కడి పేషంట్ల పరిస్థితి ఏమిటని డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్