Saturday, March 29, 2025
HomeTrending NewsFree Power: కాంగ్రెస్‌ పార్టీది దుర్మార్గపు ఆలోచన - మంత్రి కేటీఆర్‌

Free Power: కాంగ్రెస్‌ పార్టీది దుర్మార్గపు ఆలోచన – మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్‌ ఇస్తామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేయాలని సూచించింది.

ఉచిత విద్యుత్‌ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ పార్టీది అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. విద్యుత్‌ ఇవ్వకుండా గతంలో రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది అని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ పార్టీ బయటపెట్టుకుందని అన్నారు. కాంగ్రెస్‌ నిర్ణయాన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్