Saturday, November 23, 2024
Homeసినిమా'ఆదిపురుష్' కోసం టిక్కెట్ల రేట్లును పెంచారా..?

‘ఆదిపురుష్’ కోసం టిక్కెట్ల రేట్లును పెంచారా..?

ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన అథ్యాత్మిక చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆతృత అందరిలో నెలకొంది. జూన్ 16న అనగా ఈ శుక్రవారం ఆదిపురుష్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుంది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆదిపురుష్ మూవీకి టిక్కెట్లు రేట్లు పెంచుకునేలా జీవో ఇవ్వడం జరిగింది.

తాజా సమాచారం ప్రకారం… ఈ నెల 14 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కానున్నాయి. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ లలో 50 రూపాయల టికెట్ హైక్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇది మొదటి మూడు రోజులకు వర్తించనుంది. అంతే కాకుండా ఉదయం 4 గంటల నుండి షోస్ స్టార్ట్ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టిక్కెట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. వీటితో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ప్రభాస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని టాక్ వినిపిస్తుంది. మొదటి రోజు మూవీ 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని సినీ పండితుల అంచనా.

ఆదిపురుష్ మూవీ టిక్కెట్లను రణ్‌ బీర్ కపూర్, అభిషేక్ నామా, మంచు మనోజ్ తదితరులు కొని ఉచితంగా పిల్లలకు, అనాధలకు చూపించడం పబ్లిసిటీ కోసమే అనే వాదన వినిపిస్తుంది. దీని పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. శ్రీరాముడు పై ఉన్న నమ్మకంతో వాళ్లు అలా చేస్తున్నారు కానీ.. ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్నది కాదు అని క్లారిటీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకునే జీవో రావడం ఆలస్యం అవ్వడం వలన అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయడం ఆలస్యం అయ్యింది కానీ… లేకపోతే ఈపాటికే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేసేవాళ్లమని అన్నారు. భారీ అంచనాలుతో వస్తున్న ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్