Sunday, September 8, 2024
HomeTrending Newsనిరుద్యోగులకు వరం ప్రభుత్వ పథకాలు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

నిరుద్యోగులకు వరం ప్రభుత్వ పథకాలు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గురుకుల విద్యాలయాల్లో విద్యానభ్యసించిన వారిలో పలువురికి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి కారుణ్య ఉద్యోగ నియమక పత్రాలను అందచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విలువలతో కూడిన విద్యను అందించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల పాఠశాలల వ్యవస్థను మరింత బలోపేతం చేశారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 204 తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించిందని పేర్కొన్నారు. గురుకులాల్లో పోషకాహారం, వసతులను ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. గురుకులాలతో ఆశించిన ఫలితాలు రావడంతో గురుకుల పాఠశాలలో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు కూడ ఆసక్తి చూపడం అభినందనీయమని అన్నారు.

కారుణ్య నియామక పత్రాలు పొందిన వారంతా తమ తమ విధులు సక్రమంగా నిర్వహించు కోవాలని గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి రోనాల్డ్ రోస్ సూచించారు. ప్రభుత్వ స్ఫూర్తి, లక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి హన్మంత్ నాయక్, గురుకుల విద్యా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్