Sunday, May 11, 2025
HomeTrending NewsKamma Velama: కమ్మ ,వెలమ సంఘాలకు భూములపై హైకోర్టు స్టే

Kamma Velama: కమ్మ ,వెలమ సంఘాలకు భూములపై హైకోర్టు స్టే

హైదరాబాద్ కోకాపేటలో కమ్మ ,వెలమ సంఘాలకు ప్రభుత్వం కేటాయించిన విలువైన భూములపై తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కమ్మ వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జివో నెంబరు 47 పైౌ హై కోర్టు స్టే ఇచ్చింది. 2021 లో కమ్మ, వెలమ కుల సంఘాలకు చెరి ఐదు ఎకరాల భూములు కేటాయిస్తూ జీవో జారీ చేశారని, బలమైన కులాలకు భూకేటాయింపులను సరికాదంటూ ప్రొఫెసర్‌ ఎ.వినాయక్‌ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

పిట్టిషన్ పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ బెంచ్ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వమే కులాలను పెంచి పోషిస్తుందా? హైటెక్‌ రాష్ట్రం తెలంగాణలో ఇదేం పద్ధతి? 21వ శతాబ్దంలోనూ ఇలాంటి విధానాలు సరికాదు అంటూ ధర్మాసనం తీవ్ర వాఖ్యలు చేసింది. కుల సంఘాలకు ప్రభుత్వ భూములను కేటాయించడం అసంబద్ధమైన విధానమన్న హైకోర్టు…సమాజంలో అణగారిన వర్గాలకే ప్రభుత్వాలు భూములను కేటాయించాలని రాజ్యాంగంలో ఉందని తేల్చి చెప్పింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్