Saturday, January 18, 2025
HomeTrending Newsఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో గురుకుల విద్యార్థులు విజ‌య‌భేరి మోగించారు. ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల్లో గురుకుల పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు అత్య‌ధిక ఉత్తీర్ణ‌త సాధించారు. ప్ర‌తి ఏడాది గురుకుల విద్యార్థులు మెరుగైన ఫ‌లితాల‌ను సాధించి.. అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఇంట‌ర్ ఫ‌లితాల్లోనే కాదు.. టెన్త్ ఫ‌లితాల‌తో పాటు ఇత‌ర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌ల్లోనూ అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి యూనివ‌ర్సిటీల నుంచి అంత‌ర్జాతీయ స్థాయి యూనివ‌ర్సిటీల్లోనూ గురుకుల విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు.

రాష్ట్రంలోని పేద విద్యార్థుల‌కు గురుకులాల్లో నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంట‌ర్ ఫస్టియ‌ర్‌లో గురుకుల కాలేజీల విద్యార్థులు 73.30 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, సెకండియ‌ర్‌లో 78.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించి మొద‌టి స్థానంలో నిలిచారు. ఇక ప్ర‌భుత్వ కాలేజీల విద్యార్థులు ఫ‌స్టియ‌ర్‌లో 47.70 శాతం, సెకండియ‌ర్‌లో 63.56 శాతం ఉత్తీర్ణ‌త సాధించి చివ‌రి స్థానంతో స‌రిపెట్టుకున్నారు. ప్ర‌యివేటు కాలేజీల విష‌యానికి వ‌స్తే ప్ర‌థ‌మ సంవ‌త్స‌రంలో 66.50 శాతం, సెకండియ‌ర్‌లో 68.30 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా కొనసాగిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 1st ఇయర్ లో అత్యధికంగా మేడ్చల్ జిల్లా 76 ఉత్తీర్ణత శాతం  సాధించిందన్నారు. 1st ఇయర్ అత్యల్పంగా మెదక్ జిల్లాలో 40 శాతం ఉత్తీర్ణత వచ్చిందన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత శాతం – 63.32 కాగా అమ్మాయిలు – 72.33, అబ్బాయిలు- 54.25, ఇంటర్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతం – 67.16 గా ఉందన్నారు. అమ్మాయిలు – 75.28, అబ్బాయిలు – 59.21 శాతం ఉత్తీర్ణత సాధించారు.

2nd ఇయర్ అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో ఉత్తీర్ణత 78 శాతం నమోదు కాగా 2nd ఇయర్ అత్యల్పంగా మెదక్ జిల్లాలో ఉత్తీర్ణత 47 శాతం వచ్చిందన్నారు. జేఈఈ పరీక్షల కారణంగా కూడా పరీక్షలు ఆలస్యం అయ్యాయని, పరీక్షలు పగఢ్భందిగా నిర్వహించామని మంత్రి వెల్లడించారు. ఆగస్ట్ 1నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని కరోనా తరవాత ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పరీక్షలు నిర్వహించామని మంత్రి పేర్కొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్