Sunday, February 23, 2025
HomeTrending Newsఏపీ సుప్రీంకు వెళ్లినా ఇబ్బంది లేదు

ఏపీ సుప్రీంకు వెళ్లినా ఇబ్బంది లేదు

నీటి పంచాయతీకి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని సూచించారు. తెలంగాణ స్నేహహస్తాన్ని ఏపీ వినియోగించుకోవట్లేదని చెప్పారు. కేంద్రం, సుప్రీంకోర్టుకు ఏపీ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. నీటి వాటా తేల్చాలని మేమూ సుప్రీంను అడుగుతున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతుందని మంత్రి జగదీశ్‌ రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్