ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో గురువారం సమావేశమైంది. ప్రైవేటు పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సదుపాయాలను సమకూర్చడానికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ చర్చించింది. కమిటీ తన సిఫార్సులను తదుపరి సూచనలను కోసం ముఖ్యమంత్రికి సమర్పించాలని నిర్ణయించింది.
ఈ సమావేశంలో ఆర్ధిక శాఖామాత్యులు టి. హరీశ్ రావు, మున్సిపల్ శాఖామాత్యులు కె.తారక రామారావు, మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.