Thursday, March 12, 2026
HomeTrending NewsTS Assembly: శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం

TS Assembly: శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం

అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత రాష్ట్ర శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించారు.

మెదటగా ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశాక ఒక్కోక్క ఎమ్మెల్యేతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ను ఎన్నుకోవడం కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈరోజు ఉదయం రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.

స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు గడ్డం ప్రసాద్ స్పీకర్ నోటిఫికేషన్ కు నామినేషన్ వేయనున్నారు. ఏకగ్రీవంగా ఆయనను స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular