Sunday, January 19, 2025
HomeTrending Newsఉప ఎన్నికల కోసమే దళితబంధు

ఉప ఎన్నికల కోసమే దళితబంధు

కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా… లేక వాసాలమర్రి సర్పంచ్ వా అని తెలంగాణ పిసిసి ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కి ధ్వజమెత్తారు.  ఉప ఎన్నికల కోసం దళిత బందు పేరుతో కెసిఆర్  కొత్త నాటకం మొదలుపెట్టాడని మండిపడ్డారు. హుజురాబాద్ ఎన్నికల కోసం కేసీఆర్ మళ్ళీ మోసాలకు తెర లేపారని, ఉద్యోగ కల్పన జరిగి ఉంటే .. కెసిఆర్ ఇచ్చే బోడి పది లక్షలు దళితులకు అవసరం లేదని మధు యాష్కి అన్నారు. ఉద్యోగాలు ఇచ్చి ఉంటే .. ఎస్సీ,ఎస్టీ,బిసీ,మైనార్టీలు ఆర్థికంగా ఆత్మగౌరవంతో బ్రతికేవారని ఆయన  పేర్కొన్నారు. ఇంద్రవెల్లి సభ కు రాజకీయాలకి అతీతంగా అందరూ తరలిరావాలని మధు యాష్కి పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్