Saturday, November 23, 2024
HomeTrending Newsత్వరలోనే సంపూర్ణ విద్యుద్దీకరణ

త్వరలోనే సంపూర్ణ విద్యుద్దీకరణ

తలసరి విద్యుత్ వినియోగవృద్ధి రేటులో తెలంగాణ యావత్ భారత దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతనే కారణమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పాటుతో అదనంగా 9,689 మేఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర శాసనసభలో మంగళవారం రోజున జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో శాసన సభ్యులు క్రాంతి కిరణ్ చంటి,మర్రి జనార్దన్ రెడ్డి,కోరుకంటి చందర్ లు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం ఇస్తూ 7,962 మేఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో జరిగిన మొట్ట మొదటి ఎన్నికల్లో అటువంటి సంక్షోభం ఓటర్ల ముందు పెట్టి విజయం సాధించిన నేత కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ప్రపంచంలో నే మొట్ట మొదటి సారిగా నెగిటివ్ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో పెట్టి నెగ్గి రావడం అంటే ఒక అగ్ని పరిక్షేనని ఆయన అభివర్ణించారు. అటువంటి అగ్ని పరీక్షను సునాయాసంగా నిర్ణిత సమయంలో పరిష్కరించిన మహానేత కేసీఆర్ అన్నారు. మొదటి మూడు నెలలలో గృహ వినియోగదారుల తో పాటు పారిశ్రామిక రంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ ను సరఫరా చేయడంతో పాటు కేవలం సంవత్సర కాలంలోనే వ్యవసాయానికి 9 గంటలు ఏకధాటిగా విద్యుత్ ను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. అంతే గాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మూడు సంవత్సరాల వ్యవదిలోనే వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించినదని ఆయన తెలిపారు. మొత్తంగా రాష్ట్రాన్ని విద్యుద్దీకరణ చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 16,210 కోట్లతో ట్రాన్స్ మిషన్,ఈ హెచ్ టి సబ్ స్టేషన్ లు,ఇ హెచ్ టి లైన్స్ వంటి వాటి మీద ఖర్చు చేయడం జరిగిందన్నారు. అదే విదంగా డిస్కమ్ లు 33 కేవీ ఉపకేంద్రాలతో పాటు పంపిణీ లైన్స్,డి టి ఆర్ &పిటిఆర్ ల కోసం 16,048 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. గృహ,పారిశ్రామిక,వ్యవసాయ ఇతరత్రా కనెక్షన్లు పొందిన వారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి 65 లక్షలు ఉండగా తెలంగాణ ఏర్పడ్డాకే 54 లక్షల కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.ఏ బి స్విచ్ లు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్