Sunday, March 15, 2026
HomeTrending Newsగిఫ్ట్ ఎ స్మైల్ ప్రారంభం

గిఫ్ట్ ఎ స్మైల్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు చేనేత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ప్రకటించారు. ఇందులో భాగంగా అనేకమంది మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రకటించిన దివ్యాంగులకు త్రిచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమం ఈరోజు నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ గారి చేతులమీదుగా పలువురికి ఈ త్రిచక్ర వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా త్రిచక్ర వాహనాలు ఇచ్చేందుకు ముందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ  నియోజకవర్గాల్లో త్వరలో వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో చేపడతారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తన పుట్టిన రోజు ని పురస్కరించుకొని దివ్యాంగులకు త్రి చక్ర వాహనాలను ప్రకటించిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యావాదాలు తెలిపారు. తన జన్మదినోత్సవం సందర్భంగా ప్రతిసారీ ఏదో ఒక సేవా కార్యక్రమాలకు పూనుకుంటున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular