Wednesday, March 11, 2026
HomeTrending Newsబీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న సందర్భంలో…బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్1, జూన్2, జూన్3 తేదీల్లో మూడు రోజులపాటు పార్టీ అధ్వర్యంలో  ఘనంగా వేడుకలు జరుగనున్నాయి.

జూన్ 1 :

జూన్ ఒకటవ తేదీన హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తారు.

జూన్ 2 :

తెలంగాణ ఆవిర్భావం రోజు, జూన్ రెండవ తేదీన..తెలంగాణ ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న నేపధ్యంలో… దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్ లోని పార్టీ కేంద్రకార్యాలయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది.

ఇదే రోజు హైదరాబాద్లో పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జూన్ 3:

ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాల్లో ..తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జాతీయ జెండాతో పాటు పార్టీ జెండా ఎగరవేస్తారు. స్వీట్లు పండ్లు పంపిణీ చేస్తారు.

ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధినేత పిలుపునిచ్చారు.

గ్రామస్థాయినుంచి రాష్ట్ర స్థాయి దాకా  కార్యకర్తలు, పార్టీ అందించే సూచనలను  అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అధినేత కేసీఆర్… పార్టీ కార్యకర్తలు, నేతలకు విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular