Saturday, November 23, 2024
Homeసినిమాఏపీ సిఎం జగన్ కు ఫిలిం ఛాంబర్ కృతజ్ఞతలు

ఏపీ సిఎం జగన్ కు ఫిలిం ఛాంబర్ కృతజ్ఞతలు

ఏపీ ప్రభుత్వంతో జరిపిన చర్చల పై  తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏపి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్, నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్న కుమార్, నిర్మాత భరత్ చౌదరి, నిర్మాత ముత్యాల రాందాస్ పాల్గొన్నారు.

నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ ..ఏపీ సిఎం జగన్ గారికి, మంత్రి పేర్ని నాని గారికి, ఏపీ ఎఫ్.డి.సి. చైర్మన్ విజయ్ చందర్ గారు, ఎఫ్ డిసి ఎండి విజయ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆంధ్ర ప్రదేశ్ లో థియటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీ పెంచినందుకు, అలాగే నాలుగు షో లకు పర్మిషన్ ఇచ్చినందుకు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, త్వరలోనే వాటి గురించి కూడా పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ మాట్లాడుతూ .. తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున, 24 క్రాఫ్ట్ తరపున ఫిలిం ఇండస్ట్రీ తరపున ఏపీ  సిఎం జగన్ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం సహకారం తప్పనిసరి, ఎవరు ప్రభుత్వంలో వారికి మా సమస్యలను చెప్పుకుంటాం. సినిమా పరిశ్రమలో రాజకీయాలు ఉన్నప్పటికీ మొత్తం పరిశ్రమకు కావాల్సింది  ప్రభుత్వం సహకారం. ఇది మేము స్పష్టంగా తెలుపుతున్నాం. మాకు చాలా సమస్యలు ఉన్నప్పటికీ అందులో కొన్ని సమస్యలను ఏపి ప్రభుత్వం తీర్చినందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ “ఇన్నాళ్లు ఏపీలో మూడు షోలకే పర్మిషన్ ఉండగా దాన్ని నాలుగు షో లకు పర్మిషన్ ఇచ్చారు. అలాగే థియటర్స్ లో వందశాతం ఆక్యుపెన్సీ పెంచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సినిమా ఇండస్ట్రీ లో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాటిలో ఒక్కొక్కొటిగా ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది. అటు ఏపి, ఇటు తెలంగాణ ప్రభుత్వాల సహకారాలు తెలుగు ఇండస్ట్రీకి కావాలి. కరోనా కాలంలో ఎన్నడూ చూడని విపత్తు సినిమా పరిశ్రమ చూసింది. దాని నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ప్రభుత్వాల సహకారంతో సినిమా పరిశ్రమ సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలి” అన్నారు.

నిర్మాత భరత్ చౌదరి మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీ లో ఉన్న సమస్యల గురించి ఇటీవలే మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా చాలా సమస్యలను ఆయనముందు ఉంచాం.. వాటిలో కొన్ని సమస్యలను తీర్చారు.. ఈ సందర్బంగా వై ఎస్ జగన్ గారికి థాంక్స్ చెబుతున్నాం. ఇప్పటికే చాలా సినిమాలు విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం నాలుగు షోలకు పర్మిషన్ ఇవ్వడం, వందశాతం ఆక్యుపెన్సీ పెంచడంతో చాలా పెద్ద సినిమాలు కూడా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుని సాల్వ్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్