Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై దూసుకుపోతున్న తెలుగు కంటెంట్!

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై దూసుకుపోతున్న తెలుగు కంటెంట్!

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి క్రితంవారం ఒకే రోజున రెండు తెలుగు సినిమాలు అడుగుపెట్టాయి. ఈ నెల 14వ తేదీ నుంచి ‘అమెజాన్ ప్రైమ్’లో ‘లవ్ మీ’ .. నెట్ ఫ్లిక్స్ లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆశిష్ రెడ్డి – వైష్ణవీ చైతన్య జంటగా నటించిన ‘లవ్ మీ’ మే 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆశించిన స్థాయి రెస్పాన్స్ ను థియేటర్ల నుంచి రాబట్టలేకపోయింది. క్లైమాక్స్ ట్విస్ట్ ను ఆడియన్స్ ముందుగానే గ్రహించడం మైనస్ అయింది.

అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై మాత్రం ఈ సినిమా బాగానే దూసుకుపోతోంది. హారర్ నేపథ్యం .. వైష్ణవికి యూత్ లో ఉన్న క్రేజ్ ఈ సినిమాకి కలిసొచ్చాయి. ఇక విష్వక్సేన్ కథానాయకుడిగా . ఆయన జోడీగా నేహా శెట్టి నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నెట్ ఫ్లిక్స్ లో దూకుడు చూపిస్తోంది. మే 31వ తేదీన విడుదలైన ఈ సినిమా, థియేటర్ల వైపు నుంచి ఓకే అనిపించుకుంది. గోదావరి జిల్లాలోని లంకల గ్రామంలో జరిగే ఇసుక మాఫియా చుట్టూ తిరిగే కథ ఇది.

విష్వక్ కి మాస్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. ఆయనకంటూ మాస్ ఇమేజ్ కి తగిన బాడీ లాంగ్వేజ్ ఉంది. అందువలన ఆయన ఈ పాత్రలో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు. కథాకథనాలు కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా ఫైట్స్ మంచి మార్కులు కొట్టేస్తాయి. విలేజ్ నేపథ్యంతో కూడిన ఈ కథకి లవ్ .. రొమాన్స్ . ఎమోషన్స్ కి కూడా మంచి స్పేస్ దొరకడంతో,  ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ దక్కుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్