Saturday, January 18, 2025
Homeసినిమా'తగ్గేదే లే' .. ఈ సారి లవర్స్ ను టార్గెట్ చేసిన దండుపాళ్యం గ్యాంగ్!

‘తగ్గేదే లే’ .. ఈ సారి లవర్స్ ను టార్గెట్ చేసిన దండుపాళ్యం గ్యాంగ్!

‘దండుపాళ్యం’ సిరీస్ లో వచ్చే సినిమాలను ఒక వర్గం ప్రేక్షకులు చూస్తుంటారు. ‘దండుపాళ్యం’ బ్యాచ్ లోని ఆర్టిస్టులు ఆ పాత్రలను పోషించడంలో పూర్తి నైపుణ్యాన్ని సాధించారు. అందువలన పాత్రలు చాలా సహజంగా అనిపిస్తూ .. కథకి ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుంటాయి. ఈ సారి దండుపాళ్యం కథకి ఒక ప్రేమకథను ముడిపెట్టేసి ‘తగ్గేదే లే’ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నవీన్ చంద్ర హీరోగా చేసిన ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా అనన్య – దివ్య అలరించనున్నారు. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించగా, శ్రీనివాసరాజు దర్శకత్వం వహించాడు.

ఈ నెల 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాదులోని ‘దసపల్లా కన్వెన్షన్’ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. ఈ వేదికపై నవీన్ చంద్ర మాట్లాడుతూ .. “శ్రీనివాసరాజు గారు ముందుగా నాకు ఒక లవ్ స్టోరీ చెప్పారు .. రొమాన్స్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా లవ్ స్టోరీని దండుపాళ్యం గ్యాంగ్ తో ఎలా లింక్ చేస్తారా అనే ఆశ్చర్యం కలిగింది. కానీ నిజంగా ఆయన కథను నడిపించిన తీరు అద్భుతంగా ఉంది. సినిమాపై నేను పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాను.

లాక్ డౌన్ సమయంలో .. ఎవరికీ ఎలాంటి పనులు లేని సమయంలో నాకు ఈ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. అలాంటి సమయంలో నిజంగా ఒక అవకాశం రావడమే గొప్ప విషయం. ఈ కథలో నేను చేసిన పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. సంగీతం .. ఫొటోగ్రఫీ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకుని వెళతాయి. నా ఫేవరేట్ ఆర్టిస్ట్ పూజా గాంధీ గారితో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో అఆమే చేసిన ‘ముంగారు మలై’ కన్నడ మూవీని 38సార్లు చూశాను. ‘తగ్గేదే లే’ అందరూ చూడండి ..  మీ అందరి ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి పాత్రలు పోషించే అవకాశం ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్