కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నిర్మిస్తోన్న ‘రిచి గాడి పెళ్లి’ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలోని అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. బాహుబలి, భరత్ అనే నేను, మున్నా, మిర్చి, పరుగు, అరుంధతి, గోపాల గోపాల, రాజన్న వంటి అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు స్వరం అందించిన కైలాష్ కేర్ పాడిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మెచ్చుకున్నారు.
]“రిచిగాడి పెళ్లి లోని ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..’ సాంగ్ చూశాను. కైలాష్ గారు ఎక్స్ ట్రార్డినరీగా పాడారు. తన వాయిస్ ఈ పాటకి చాలా బాగుంది. నాకు హేమ్ రాజ్ వైశాలి సినిమా నుంచి తెలుసు. ఈ సినిమాకు ఆయన పని చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరూ మంచి ప్రయత్నంతో ఈ సినిమా చేస్తున్నారు. అందరూ సపోర్ట్ చేయాలి. అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ లో కైలాస్ గారు బ్యూటిఫుల్ గా పాడారు, సత్యన్ చాలా బాగా కంపోజ్ చేశారు, ఈ సినిమా అందరికీ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
అనంత శ్రీరామ్ మాట్లాడుతూ “రిచి గాడి పెళ్లి వంటి విచిత్రమైన చిత్రంలో ఏమిటిది మతి లేదా.. ప్రాణమా అనేది వేదాంతాన్ని బోధించే పాట. ఇది అంత పెద్ద వేదాంతాన్ని బోధించినా కూడా అలతి అలతి పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో మధురమైన బాణీలో ఈ పాట ఉంటుంది. మనం చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను (ఇప్పట్లో ఇండోర్ గేమ్స్) ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. ఆ చిన్న ఆట వల్ల ఎన్ని జీవితాల్లో, ఎన్ని ప్రేమల్లో, ఎన్ని స్నేహాల్లో ఎన్ని మార్పులు వస్తాయి, ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం మీ అందరినీ కచ్చితంగా నచ్చుతుంది. అలాగే నేను రాసిన పాట కూడా మిమ్మల్నందరినీ కచ్చితంగా అలరిస్తుంది” అని అన్నారు.
దర్శకుడు కె యెస్ .హేమ్ రాజ్ మాట్లాడుతూ “రిచి గాడి పెళ్లి అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ముఖ్యంగా లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ రాసిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారు పాట చాలా బాగుందని మెచ్చుకున్నారు, వారికి మా కృతజ్ఞతలు .ఇంత మంచి పాట అందించిన అనంత శ్రీరామ్ కు, సింగర్స్ కు ధన్యవాదాలు. మా డిఓపి విజయ్ ఉలగనాథ్ గారు చేసిన వర్క్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే చిత్రానికి పని చేసిన బృందం మొదలు తారాగణం వరకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.