Friday, September 20, 2024
Homeసినిమా'గుంటూరు కారం' నుంచి థమన్ ను తప్పించారా..?

‘గుంటూరు కారం’ నుంచి థమన్ ను తప్పించారా..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా కంటే ముందు నటించిన సర్కారు వారి పాట సినిమాకి థమన్ సంగీతం అందించారు. అయితే.. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అవ్వలేదు. ఒకటి రెండు పాటలు మాత్రమే పాపులర్ అయ్యాయి. దీంతో మహేష్ థమన్ వర్క్ పై బాగా ఫీలైన మహేష్‌ బాబు నెక్ట్స్ మూవీకి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టుకోవాలి అనుకున్నారట. గుంటూరు కారం చిత్రానికి మహేష్‌ బాబుకి ఇష్టం లేకపోయినా.. త్రివిక్రమ్ పట్టుబట్టి మరీ.. థమన్ తో మ్యూజిక్ చేయిస్తున్నారు.

అయితే.. ఇప్పుడు ఈ మూవీ నుంచి థమన్ తప్పుకున్నాడని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల గుంటూరు కారం టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోకు అందించిన మ్యూజిక్ పై ఫ్యాన్స్ అయితే సంతృప్తిగా లేరు. ఇప్పటి వరకు సినిమాకి ఒకే ఒక ట్యూన్ ఇచ్చాడట. అది కూడా మహేష్ కి నచ్చలేదట. దీంతో వారం రోజుల్లో ట్యూన్స్ ఇస్తే ఓకే. లేదంటే… వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని చూడండి అని హీరో చెప్పారని టాక్ వినిపిస్తుంది. జీవీ ప్రకాష్‌ కుమార్ పేరు వినిపిస్తుంది. దీంతో ఇది నిజమో కాదో తెలియదు కానీ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. గుంటూరు కారం మూవీ నుండి థమన్ ని తొలగించారు అంటూ పలు మీడియా మాధ్యమాల్లో వచ్చిన న్యూస్ వైరల్ అయ్యింది.  అయితే.. ట్విట్టర్ లో స్పందించిన థమన్, బాగా కడుపుమంట కలిగిన వారికి అరటిపళ్ళు ఎంతో బాగా పని చేస్తాయని, అలానే తన స్టూడియో వద్ద మజ్జిగ స్టాల్స్ కూడా ఫ్రీగా స్టార్ట్ చేస్తున్నానని, ఇక్కడికి వచ్చి అవి తాగి కడుపు మంట తగ్గించుకోండి అంటూ థమన్ పోస్ట్ చేశారు. ఇది గుంటూరు కారం మూవీ నుండి తీసేయలేదని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని అందుకే.. ఈవిధంగా థమన్ క్లారిటీ ఇచ్చినట్లు అనిపిస్తుందనేది టాక్. మొత్తానికి ఈవిధంగా మరోసారి వార్తల్లో నిలిచాడు థమన్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్