Saturday, March 14, 2026
Homeసినిమారామ్‌చరణ్‌, శంకర్‌ మూవీకి తమన్ సంగీతం

రామ్‌చరణ్‌, శంకర్‌ మూవీకి తమన్ సంగీతం

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ దిల్‌ రాజు, శిరీశ్‌ నిర్మిస్తోన్న పాన్‌ ఇండియా మూవీకి ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్‌ రూపొందించిన ‘బాయ్స్‌’ సినిమాలో నటించిన తమన్‌, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీకి సంగీతం అందించడం పై సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాలని ఆతృతగా తమన్‌ ఎదురుచూస్తున్నారు. శంకర్‌ నిర్మించిన ‘వైశాలి'(ఈరం) చిత్రంతోనే తమన్‌ సంగీత దర్శకుడిగా తన కెరీర్‌ను స్టార్ట్‌ చేయడం విశేషం. “ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి గొప్ప డైరెక్టర్‌తో కలిసి పని చేయడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది” అని తమన్ గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే ఈ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ రికార్డింగ్‌ పనిని హైదరాబాద్‌లో.. ఈ నెల 14,15వ తేదీల్లోనే ప్రారంభించారు.

ఈ పాటను రికార్డ్‌ చేయడానికి శంకర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ భారీ సాంగ్‌ కోసం 135 మంది మ్యూజిషియన్స్ పని చేయడం విశేషం. ఇందులో రామ్‌చరణ్‌ కూడా భాగమయ్యారు. పాట విని చాలా ఎగ్జయిట్‌మెంట్‌కు ఫీలయ్యారు. ఈ భారీ బడ్జెట్‌ మూవీ దిల్‌ రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular