Saturday, January 18, 2025
HomeసినిమాThandatti: తక్కువ ఖర్చుతో బలమైన కథ....'తందట్టి'

Thandatti: తక్కువ ఖర్చుతో బలమైన కథ….’తందట్టి’

ఒక సినిమా తీయాలంటే కోట్లలో ఖర్చు అవుతుంది. స్టార్స్ లేకుండా జనాలు థియేటర్లకు రారు .. ఫైట్లు ఒక రేంజ్ లో ఉండాలి .. అవసరమైతే హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దింపాలి.   జానపదగీతాలనైనా ఫారిన్ లోనే తీయాలి. ఫారిన్ వెళ్లడం కుదరకపోతే, అందుకు సంబంధించిన సెట్ కూడా ఇక్కడ వేయవలసిందే. ఎటు తిరిగి ఎటు చూసినా ఫారిన్ కనిపించకుండా కథను చెప్పడం కుదరదు అనే స్థాయికి చాలామంది వచ్చేశారు. ఫారిన్ ను టచ్ చేయకుండా ఇక్కడి కథలు కదలవు అనే స్థితికి వెళ్లిపోయారు.

విదేశాల్లో ఇంతవరకూ ఎవరూ కెమెరా స్టాండ్ కూడా పెట్టని చోటుకి వెళదామని ప్లాన్ చేసేవారు కూడా లేకపోలేదు. ఏది చేసినా అది తమ సినిమాకి ఒక ప్రత్యేకతగా .. ఒక సరికొత్త రికార్డుగా ఉండాలనే ఉద్దేశంతో పరుగులు పెడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ పరుగులోనే అసలు కథను అలా వదిలేస్తున్నారు. అలాంటివారిని ఆలోచింపజేసే సినిమాగా ‘తందట్టి’ని గురించి చెప్పుకోవాలి. ఎలాంటి స్టార్స్ లేకుండా .. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

అది ఒక సాధారణమైన పల్లెటూరు .. అక్కడి మనుషులు కాస్త తేడా. అక్కడికి వెళ్లిన పోలీసులు ప్రాణాలపై ఆశలు వదులుకోవలసిందే. ఆ ఊరికి చెందిన ఒక ముసలావిడ కనబడటం లేదనే ఫిర్యాదులో కానిస్టేబుల్ పశుపతి అక్కడికి వెళతాడు. ఈ వెళ్లే క్రమంలోనే ఆ ఫ్యామిలీ గురించి ఆ ముసలావిడ మనవడి ద్వారా తెలుసుకుంటాడు. పోలీసులంటే పడని ఆ ఊళ్లో ఆ కానిస్టేబుల్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే కోణంలో ఈ కథ నడుస్తుంది. పల్లెటూళ్లో .. ఒక చావు ఇంటి చుట్టూ తిరిగే ఈ కథ, లవ్ .. సస్పెన్స్ .. కామెడీని టచ్ చేస్తూ వెళ్లి చివర్లో కన్నీళ్లు పెట్టిస్తుంది. కథ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్