Sunday, January 19, 2025
Homeసినిమాఅక్కినేని నాగ‌చైత‌న్య ‘థాంక్యూ’ చిత్రీకరణ పూర్తి

అక్కినేని నాగ‌చైత‌న్య ‘థాంక్యూ’ చిత్రీకరణ పూర్తి

Thank You wrapped: అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వలో రూపొందుతోన్న చిత్రం ‘థాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని నాగ చైత‌న్య త‌న ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియ‌జేశారు. కొన్ని రోజులుగా ఎంటైర్ యూనిట్.. ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో ‘థాంక్యూ’ షూటింగ్ జరుపుకుంది.


నాగచైతన్య సరసన రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. బి.వి.ఎస్‌.ర‌వి క‌థ‌ను అందించారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ‘మనం’ తర్వాత చైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. దీంతో ఈ మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. స‌మ్మ‌ర్ లో థ్యాంక్యూ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

Also Read : ‘థ్యాంక్యూ’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్