Run Time: అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థాంక్యూ. ఈ చిత్రానికి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ క్రేజీ మూవీ జూలై 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమైంది. మనం చిత్రం తర్వాత చైతు, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జీవితంలోని వివిధ దశల్లో అభిరామ్ అనే క్యారెక్టర్ ప్రయాణమే థ్యాంక్యూ మూవీ. ఈ సినిమాలో చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ప్రెసిడెంట్ గా కనిపించనున్నాడు.ఈ రొమాంటిక్ డ్రామాలో చైతన్య సరసన హీరోయిన్ గా రాశి ఖన్నా నటించింది. ఇందులో మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ సాంగ్స్ టీజర్ అండ్ ట్రైలర్ కు అనూహ్యమైన స్పందన రావడంతో థ్యాంక్యూ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పుడు ఈ చిత్రం 2 గంటల 9 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్ర రచయిత బివిఎస్ రవి కన్ ఫర్మ్ చేశారు. రన్ టైమ్ తక్కువ ఉండడం సినిమాకి ప్లస్ అని.. ఖచ్చితంగా థ్యాంక్యూ మూవీ అందరికీ నచ్చుతుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న నాగచైతన్యకు ఈ మూవీతో మరో విజయం దక్కాలని ఆశిద్దాం.