Friday, October 18, 2024
HomeTrending Newsమహిళలు వంటలు, వ్రతాలే చేయాలా?

మహిళలు వంటలు, వ్రతాలే చేయాలా?

తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ స్థాపించామని, వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ వ్యతిరేకి అవునా, కాదా అనేది గ్రామాల్లో తెలుసుకోవాలని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ తెలంగాణకు వ్యతిరేకి కాదని, ప్రత్యేక తెలంగాణ అవసరం ఉందని గతంలో 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారని షర్మిల గుర్తుచేశారు. పార్టి ఆవిర్భావం తర్వాత మొదటి సారిగా షర్మిల మీడియాతో మాట్లాడారు. యుపిఎ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణ ఏర్పాటు అంశం పెట్టారు. వైఎస్సార్ తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశారన్న షర్మిల చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నారని, పాల్గొనని వారు తెలంగాణ వ్యతిరేకులు కాదన్నారు.

తెలంగాణకు వ్యతిరేకం అని తానూ ఏనాడు చెప్పలేదన్న షర్మిల ఇది నా గడ్డ.. దీనికి మేలు చేయడానికి వచ్చానని స్పష్టం చేశారు. పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని… వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఈ పార్టీ స్థాపించామని చెపారు. ఈ పార్టీని అవమానిస్తే వైఎస్సార్ ను అవమానించినట్టెనన్నారు. కృష్ణ, గోదావరి బోర్డుల మీటింగ్ లను కేసీఆర్ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ అన్ని విషయాలను పెద్దగా పట్టించుకోరు కనుకనే కేంద్రం ఈ గెజిట్ విడుదల చేసిందన్నారు.

కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని, అలా చేస్తారని భావిస్తున్నాఅని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ నది  అయినా… ఒక్క చుక్క నీటి బొట్టును తెలంగాణ వదులుకోదు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఒక్క నీటి చుక్కను తీసుకోమని షర్మిల తేల్చి చెప్పారు. కేంద్రం గెజిట్ పై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే స్పందిస్తామన్నారు. ఏపీలో రాజన్న రాజ్యం స్థాపిస్తున్నట్లే కనిపిస్తుందని, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్ అని భాష్యం చెప్పారు. కేటీఆర్ అంటే ఎవరు? కేసీఆర్ గారి కొడుకా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు మహిళలంటే గౌరవం లేదు. కేటీఆర్ కూడా అలాగే వ్యవహరిస్తారన్నారు. కేటీఆర్ దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో వంటలు చేసుకోవాలా? వ్రతాలు చేసుకోవాలా అని షర్మిల మండిపడ్డారు. కేటీఆర్ పెద్ద మొగోడు కదా మహిళలు, నిరుద్యోగులకు ఏం చేస్తున్నారని, రాష్ట్రంలో 3.85 వేల ఖాళీలను భర్తీ చేయాలి ముందుగా ఆ పని చేయండని షర్మిల హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్