Saturday, January 18, 2025
Homeసినిమా'ది ఘోస్ట్'కి హాలీవుడ్ మూవీకి లింకేమిటి?

‘ది ఘోస్ట్’కి హాలీవుడ్ మూవీకి లింకేమిటి?

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్‘.  ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ద‌స‌రా కానుక‌గా ఈ మూవీని అక్టోబ‌ర్ 5న రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ సినిమాపై ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది.

ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాలను తలపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ ప్రమోషనల్ వీడియోను చూస్తుంటే  హాలీవుడ్ లో వచ్చిన కొన్ని సినిమాలు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు. హాలీవుడ్ లో గతంలో వచ్చిన పలు యాక్షన్ సన్నివేశాలు ది ఘోస్ట్ లో చూస్తున్నట్లుగా అనిపిస్తుదంటూ మరికొందరు ఇంగ్లీష్ సినిమా పేర్లతో కలిపి మరీ చెప్పుకొచ్చారు.

యాక్షన్ సినిమాలు అనగానే చాలా మంది హాలీవుడ్ సినిమాలతో పోల్చి చూడడం కామన్ విషయం. ఏదో ఒక సినిమా తాలూకు ఇన్ పుట్స్ ఖ‌చ్చితంగా ఉంటాయి అనేది కొందరి అభిప్రాయం. ది ఘోస్ట్ సినిమా ఏ హాలీవుడ్ సినిమాకు ఇన్సిపిరేషన్ అయినా.. లేదా కాపీ అయినా వచ్చే నష్టం ఏమీ లేదు. నాగార్జున ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ హిట్ ను దక్కించుకుంటాడనే  ఆశతో ఉన్నారు అక్కినేని అభిమానులు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్