రాష్ట్రం లో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతోందని, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. ప్రగతి భవన్ కి ఇనుప కంచెలు, ఫార్మ్ హౌస్ కి గోడలు కట్టుకుని ఉంటున్నాడు కేసీఆర్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. సీఎం ఒక చక్రవర్తి ల ఎవరి మాట వినను అంటున్నారని మండిపడ్డారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయని సంజయ్ తన సొంత కార్యాలయంలో జాగరణ కార్యక్రమం పెట్టుకుంటే అడ్డుకుని యుద్ధ వాతావరణం సృష్టించారని ఈటెల హైదరాబాద్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రు సైన్యాల మధ్య జరిగే ఘర్షణ ల కమిషనర్ వ్యవహరించారని, సంజయ్ ని జైలు కి పంపించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్త్రం చేశారు.
బీజేపీ కేసులకు భయ పడదని, ఇది బెంగాల్ కాదు…ఇది తెలంగాణ గడ్డ అనే విషయం కెసిఆర్ గుర్తుంచుకోవాలని రాజేందర్ హెచ్చరించారు. ఎన్నో త్యాగాలు ఇక్కడ చేసిన పార్టీ బీజేపీ అని హుజూరా బాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత సిఎం కెసిఆర్ ఆగం ఆగం అవుతున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన కాళ్ళ కింద భూమి కదులుతుంది అని భయపడుతున్నాడన్నారు. నిర్బంధంతో కెసిఆర్ ఏమి సాదించలేడని, ఇంత జరుగుతుంటే ఉద్యోగ సంఘాలు పట్టించుకోక పోవడం సమంజసం కాదని ఈటెల రాజేందర్ అన్నారు. నీరో చక్రవర్తిల వ్యవహరిస్తున్న కేసీఆర్ తో ఉద్యోగ సంఘాల సమస్యలు పరిష్కారం కావని ఈటెల రాజేందర్ తేల్చి చెప్పారు.