Sunday, January 19, 2025
HomeTrending Newsప్రజా సమస్యలపై యుద్ధమే - బండి సంజయ్

ప్రజా సమస్యలపై యుద్ధమే – బండి సంజయ్

వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యాలతో భయపడిని రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలవల్ల 5 గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలన్నారు. తక్షణమే  రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్న రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదో రైతులు టీఆర్ఎస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఒకనాడు అందరికీ అన్నం పెట్టిన మెతుకు సీమ మెదక్ జిల్లా అని, నేడు ఈ జిల్లా ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ దారుణస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలు తెలుసుకుని వారికి భరోసా ఇచ్చేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన బండి సంజయ్ కుమార్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్దం చేస్తామని హమీనిచ్చారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 18వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద సభకు హాజరైన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగ పూర్తి పాఠం వివరాలు…..

మెదక్ నా అడ్డా అని కేసీఆర్ అంటుండు. మొన్న ఎంఐఎం కూడా పాతబస్తీ అడ్డా అని చెబితే…ఏం చేసినం? ఎక్కడికి పోవాలో అక్కడికి పోయి గర్జించినం, గాండ్రించినం.
నిన్న కేంద్రమంత్రి శోభ కరంద్లాజే సీఎంను శభాష్ అన్నట్లు సీఎం కేసీఆర్ ఆఫీస్ నుండి తప్పుడు ప్రచారం చేస్తుండు. నేనిదే మాట శోభక్కను అడిగితే…‘ఆయన ఏం చేసిండని పొగడాలి?’అని అన్నది. కేసీఆర్ నైజమే అంత. ఢిల్లీకి పోయి నరేంద్రమోదీని కలిసి వంగివంగి దండాలు పెడతడు. బయటకొచ్చి మోదీ నన్ను పొగిడారని ప్రచారం చేసుకుంటుండు.  పాదయాత్రకు వస్తున్న జనంతో కేసీఆర్ వణికిపోతుండు. బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లు ఇస్తుంటే తట్టుకోలేక అధికారులను సస్పెండ్ చేయడం మొదలుపెట్టిండు.

ప్రజల్లో అయోమయం స్రుష్టించేందుకు బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటేనని దుష్రచారం చేస్తుండు. ఏనాడూ బీజేపీ-టీఆర్ఎస్ కలిసి పోటీచేయలేదు? కలిసి పోటీ చేసిన చరిత్ర టీఆర్ఎస్-కాంగ్రెస్-ఎంఐఎం-టీడీపీ పార్టీలదే. రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రత్యామ్నాయమని భావనకు వచ్చేశారు.

వర్షాలతో తెలంగాణలో పంటలు ఎక్కువ పండుతున్నయ్. ఆ పంటను కొనడం చేతగాని సీఎం ఆ నెపాన్ని కేంద్రంపై మోపాలని చూస్తుండు. కేసీఆర్…కష్టాల్లో ఉన్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? కేంద్రం ఇస్తున్న నిధులను రైతులకు ఎందుకు అందించడం లేదు? ఫసల్ బీమా ఎందుకు అమలు చేయడం లేదు? ప్రజలకు సమాధానం చెప్పాలి.

జీతాలివ్వడానికే డబ్బుల్లేని ప్రభుత్వం దళిత బంధు ఇస్తానని ఆశ చూపుతూ మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తుండు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిండు. ఒక్కో తలపై రూ.లక్షకుపైగా అప్పు భారం మోపిండు.

ప్రజల కోసం కొట్లాడే పార్టీ బీజేపీ. ప్రజల కోసం లాఠీదెబ్బలు తినే పార్టీ బీజేపీ. హైదరాబాద్, వరంగల్ లో వరదలొస్తే ఈ సీఎం రాలేదు. ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం రాలేదు. ఆర్టీసీ కార్మికులు చచ్చినా వెళ్లడు. పేద్దోళ్లు చనిపోతే మాత్రం వెళ్లి బోకేలు పెట్టి సంతాపం చెబుతాడు. కానీ బాధితును, పేదల వద్దకు వెళ్లి భరోసా స్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. ఈ మూర్ఖుడి పాలనలో జరిగిన నిర్లక్ష్యంవల్ల ఇంటర్మీడియట్ప పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి. కొన ఊపిరితో కొట్లాడుతూ సిరిసిల్ల ఇంటర్ విద్యార్థిని నాకు బతకాలని ఉంది. కాపాడండీ…అంటూ ఏడుస్తుంటే చూడలేని సన్నివేశం. చివరకు వైద్యం అందక ప్రాణాలు కోల్పొయిన దుస్థితి.

కేంద్రం ఇస్తున్న పథకాలన్నీ హిందువులతోపాటు ముస్లింలుసహా అర్హులైన ప్రతి ఒక్క మతానికి, కులానికి ఇస్తున్నం. అన్ని వర్గాలను సమానంగా చూస్తుంటే మమ్ముల్ని మతతత్వవాదులని అంటున్నరు. మేం బరాబర్ హిందూ సమాజ ఐక్యత కోసం పోరాడతాం. బరాబర్ రోజుకో దేవుడిని పూజిస్తం. నెలకో పండుగ చేసుకుంటం. అన్నింట్లో దైవాన్ని కొలిచి పూజించే ధర్మమే హిందూ ధర్మం. సనాతన ధర్మాన్ని కాపాడతాం. అన్ని పార్టీలు 12 శాతం మైనారిటీ ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నయ్. కానీ బీజేపీ మాత్రం ఏనాడూ ముస్లింలకు వ్యతిరేకం కాదు. కానీ హిందువులను చీల్చాలని చూస్తే బరాబర్ అడ్డుకుని కొట్లాడి తీరతాం.
బీహార్ లో ఎంఐఎం 5 సీట్లు గెలిచింది. అక్కడ ఎంఐఎం ఎలాంటి హామీలూ ఇవ్వలే. అక్కడ ఆ పార్టీ ప్రభుత్వం కూడా లేదు. కేవలం 12 శాతం మైనారిటీ ఓట్లతో ఎంఐఎం గెలిచింది. మరి 12 శాతం ఓట్లతో 5 సీట్లు ఎంఐఎం గెలిస్తే….80 శాతం హిందువులున్న తెలంగాణలో బీజేపీ గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎందుకు రెపరెపలాడకూడదు? బరాబర్ బీజేపీ జెండాను ఎగరేస్తాం.
సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలా? వద్దా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బరాబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పి మాట తప్పిన నీచుడు కేసీఆర్. ఆదిలాబాద్ జిల్లాలో ఒకే మర్రి చెట్టుకు వెయ్యి మందిని ఉరేసిన చరిత్ర నిజాం పాలనది. ఆ రోజు స్మరించుకోవాలా? వద్దా? కేసీఆర్….ఎంఐఎం నేతలకు భయపడి నిజాం సమాధి వద్ద మోకరిల్లిన మూర్ఖుడు కేసీఆర్. వాళ్లకు భయపడి, నిజాం ఆస్తుల కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. అందుకే కేసీఆర్ మోసాలను ఎండగట్టేందుకు, తెలంగాణ విమోచన దినోత్సవ గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పేందుకే నిర్మల్ లో ఈనెల 17న జరిగే సభకు అమిత్ షా వస్తున్నారు. ప్రతి ఒక్కరూ కదిలిరావాలని కోరుతున్నా.


పాదయాత్రను చూసి టీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టింది : మాజీ మంత్రి బాబూమోహన్

చెల్లని రూపాయి ఇక్కడి ఎమ్మెల్యే. జనమే రావడం లేదని అంటున్నరు. తలకాయ ఉందా? మతిలేక మాట్లాడుతున్నారా? పనిలేనిది, చేతగానిది మీకు…తప్ప బీజేపీకి కాదు. నేను చేసిన పనులకు రంగులు మార్చి తమ పేరు చెప్పుకుంటున్నరు టీఆర్ఎస్ నేతలు. ఆందోల్ ఎమ్మెల్యే చేతగానోడు. ఓరి ముండమోపీ…రోడ్డు తెచ్చుకునే సత్తా ఉందా? చెల్లని రూపాయి నువ్వు. మాపై విమర్శలు చేసే స్థాయి ఉందా? ప్రగతి భవన్ పై రాళ్లేసిన చరిత్ర నీకుంది? నువ్వా మా అధ్యక్షులు బండి సంజయ్ గురించి మాట్లాడేది? పాదయాత్రకు వస్తున్న జనస్పందనను చూసి టీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టింది. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరు.


కేసీఆర్…..ఉరేయాల్సింది మిమ్ముల్నే : మాజీ మంత్రి రఘునందన్ రావు

పేరుకు మెతుకు సీమ. ఒకప్పుడు అన్నం పెట్టిన గడ్డ ఈనాడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న గడ్డ. బీజేపీ ఏం చేసిండని కొందరు అంటున్నరు. ఈ జిల్లా ఎమ్మెల్యేలు రోజూ హైదరాబాద్ నుండి వస్తూ పోతున్నరు దర్జాగా….జాతీయ రహదారిని అద్భుతంగా నిర్మించింది బీజేపీ. రేపో మాపో రోడ్డు విస్తరణ కూడా జరగబోతోంది మోదీ నాయకత్వంలో. గత ఎన్నికల్లో మెదక్, దుబ్బాక, సిద్దిపేట, ఎల్కతుర్తి వరకు కొత్త రహదారి నిర్మాణానికి గత నెల రూ.690 కోట్లను మంజూరు చేసిన ఘనత నరేంద్రమోదీదే. తెచ్చింది బీజేపీ….నున్నటి రోడ్లపై బుర్రబుర్ర పోతున్న ఎమ్మెల్యేలు బీజేపీ ఏం చేసింది? అని అడుగుతుండటం సిగ్గుచేటు.
• 2005లో కాంగ్రెస్ పార్టీ హయాంలో రైల్వే మంత్రి లాలూప్రసాద్ మనోహరాబాద్ వరకు రైలు మంజూరు చేసినా 10 ఏళ్లుగా ఒక్క పని చేయలేదు. మోదీ వచ్చాకే నిధులు మంజూరై పనులు చకచకా జరుగుతున్నయ్. ఆ డబ్బులు ఎవరివి హరీష్…మీ మామ ఇచ్చిండా?….కానీ మీరేం చేసిండ్రు? ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు.

మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో జరుగుతున్న సభకు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ, ఎస్సీ, యువ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, భాను ప్రకాశ్, గీతామూర్తి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ సింగాయపల్లి గోపి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాని రామక్రిష్ణ తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్