Friday, March 13, 2026
HomeTrending NewsKollur: పేదల ఆత్మగౌరవ సౌధం...కొల్లూరులో ప్రారంభం

Kollur: పేదల ఆత్మగౌరవ సౌధం…కొల్లూరులో ప్రారంభం

పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం, కొల్లూరు గ్రామంలో నిర్మించిన గృహ సముదాయాన్ని  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.
15,660 డబుల్ బెడ్ రూమ్‌ల గృహ సముదాయం ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గా పేరు గడించింది.  ఈ సందర్భంగా టౌన్ షిప్ పరిసరాల్లో బ్యాటరీ బగ్గీ లో సీఎం కలియ తిరిగారు.
అనంతరం లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్‌ అపార్ట్‌మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో, ఆధునిక సౌకర్యాలతో ఇంటి నిర్మాణాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సి.హెచ్ మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular