Sunday, January 19, 2025
HomeTrending Newsనిన్నటి డ్రైవర్ దళితబంధుతో నేడు ఓనర్

నిన్నటి డ్రైవర్ దళితబంధుతో నేడు ఓనర్

నిన్నటి వరకు ఒకరి దగ్గర డ్రైవర్ గా పని చేసిన దళితుడు నేడు అదే వాహనానికి ఓనర్ గా మారడం దళిత బంధు గొప్పతనాన్ని తెలియజేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ లో  గురువారం కలెక్టరేట్ ఆవరణలో దళిత బంధు లబ్ధిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి దళిత బందులో ఎంపికైన లబ్ధిదారులకు  నాలుగు యూనిట్లు వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళిత బంధు ను కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలేట్ ప్రాజెక్టుగా ఈ నెల 16 న ప్రారంభించి ఇదే నెలలో లబ్ధిదారులకు వాహనాలందించడం అభినందనీయం అని అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం లోని  21 వేల దళిత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వీలు కల్పిస్తుందని అన్నారు.

పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈర్షపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి దళిత బంధు అమలు చేస్తుందని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కన్న కళలను ముఖ్యమంత్రి కెసిఆర్ నిజం చేస్తున్నారని కొనియాడారు.  నిన్నటి వరకు డ్రైవర్ ఉన్న అతను నేడు వాహన యజమానిగా, గతంలో గుమస్తా నేడు ట్రాలీ యజమానిగా మారడం దళిత బంధు గొప్పతనం అన్నారు. ఈ సందర్భంగా మంత్రులు దళిత బంధు పథకం కింద దాసారపు స్వరూప రాజయ్య దంపతులకు ట్రాక్టర్, ఎలుక పల్లి కొమరమ్మ – కనకయ్య దంపతులకు ట్రాక్టర్,  జి సుగుణ – మొగలి దంపతులకు ట్రాలీ, రాచపల్లి శంకర్ కు మారుతి  కారును మంత్రులు  అందజేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ , రవాణా శాఖ ఉప కమీషనర్ ఎం. చంద్ర శేఖర్ గౌడ్, ఈ డి  ఎస్సీ కార్పొరేషన్ సురేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్