Sunday, March 8, 2026
HomeTrending NewsTelangana: ప్రచారం ముగిసింది...మైకులు బంద్

Telangana: ప్రచారం ముగిసింది…మైకులు బంద్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలకు తెర పడింది. 13 నియోజకవర్గాల్లో గంట ముందే ముగిసిన ప్రచారం. ప్రచారం ముగియగానే స్థానికేతరులు నియోజకవర్గంలో విడిచి వెళ్ళాలి. సాయంత్రం 5 గంటల తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు,రాజకీయ ప్రకటనలు చేయరాదు.

119 నియోజకవర్గాలలో బరిలో 2290 మంది అభ్యర్థులు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్లు. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 1,62,98,418 కాగా, మహిళ ఓటర్లు 1,63,01,705 మంది. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 2,676 మంది, సర్వీసు ఓటర్లు 15,406, ఓవర్సీస్‌ ఓటర్లు 2,944 మంది ఉన్నారు.

ఈనెల 30న పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 10 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 250కి పైగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 166 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ నుండి ఇప్పటివరకు దాదాపు 709 కోట్ల రూపాయలు సీజ్ చేశారు.

ఎన్నికల విధుల్లో దాదాపు 2.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 45 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలతో నిఘా. 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేసింది.

ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు బంద్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్సెస్ తో పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.

భద్రాచలం, బెల్లంపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, యెల్లెందు, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ బలగాలను మొహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular