Saturday, January 18, 2025
Homeసినిమా'ది ఘోస్ట్' ర‌న్ టైమ్ ఎంతో తెలుసా?

‘ది ఘోస్ట్’ ర‌న్ టైమ్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్‘. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో నాగార్జున స‌ర‌స‌న సోనాల్ చౌహాన్ న‌టించింది. ఈ మూవీ టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన త‌ర్వాత అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయ‌ని చెప్ప‌చ్చు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… ఇటీవ‌ల ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. దీంతో ర‌న్ టైమ్ ఎంత అనేది బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ర‌న్ టైమ్ ఎంతంటే.. 135 నిమిషాలు. అంటే.. రెండు గంట‌ల ప‌దిహేను నిమిషాలు. ర‌న్ టైమ్ త‌క్కువుగా ఉండ‌డం సినిమాకి ప్ల‌స్ అని చెప్ప‌చ్చు. ఇక సెన్సార్ టాక్ ఏంటంటే… ఈ మూవీలో 12 యాక్ష‌న్ సీన్స్ ఉంటాయ‌ట‌. ఇవి సినిమాకి హైలెట్ గా నిలుస్తాయ‌ని అంటున్నారు.

ఇంట‌ర్వెల్ ముందు.. ఇంట‌ర్వెల్ త‌ర్వాత వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్స్ అయితే… ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ క‌లిగిస్తాయ‌ని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే… ఓ కొత్త త‌ర‌హా సినిమాని చూసిన ఫీలింగ్ ను ది ఘోస్ట్ క‌లిగిస్తుందని.. ఈ మూవీ అదిరింది. బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా అనే టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తెలుగుతో పాటు త‌మిళ్, హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.  మ‌రి.. ది ఘోస్ట్ మూవీ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read :  ‘ది ఘోస్ట్’కు యూ/ఎ సర్టిఫికేట్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్