Thursday, March 12, 2026
Homeసినిమాది ఘోస్ట్ కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభం

ది ఘోస్ట్ కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభం

Ooty Ghost: టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దరకత్వంలో తెరకెక్కుతున్న  హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ పై భారీ అంచనాలు వున్నాయి.  డిఫరెంట్ కాన్సెప్టులతో హీరోలను విభిన్నంగా ప్రజెంట్ చేయడంలో పేరుపొందిన ప్రవీణ్ సత్తారు, కింగ్ నాగార్జునను విభిన్నమైన పాత్రలో చూపించి ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

చిత్ర యూనిట్ ఇటీవల దుబాయ్‌లో సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి  చేసుకుంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సోనాల్ చౌహాన్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైయింది .“ఊటీలో ఉదయాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి” అని ట్వీట్ చేస్తూ.. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఊటీ లొకేషన్ స్టిల్ ని అభిమానులతో పంచుకున్నారు.

గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ల పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular