Sunday, January 19, 2025
Homeసినిమా‘ఘోస్ట్’ తర్వాతి షెడ్యూల్ ఎక్క‌డ‌?

‘ఘోస్ట్’ తర్వాతి షెడ్యూల్ ఎక్క‌డ‌?

Ghost in Ooty: టాలీవుడ్ కింగ్ నాగార్జున సంక్రాంతికి ‘బంగార్రాజు’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించారు. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ‘ది ఘోస్ట్’ అనే సినిమా చేస్తున్నారు. నాగ్ స‌ర‌స‌న సోనాల్ చౌహాన్ న‌టిస్తోంది. ఇటీవల దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అక్కడ కీలక సన్నివేశాల్ని, యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరించాడు దర్శకుడు. దుబాయ్ షెడ్యుల్ కు సంబంధించిన స్టిల్స్ రిలీజ్ చేయ‌డం.. ఆ స్టిల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డం తెలిసిందే. దీంతో ఈ సినిమా పై ఆడియ‌న్స్ లో మ‌రింత క్యూరియాసిటీ పెరిగింది.

ఇదిలా ఉంటే.. తదుపరి షెడ్యూల్‌ను ఊటీలో ప్లాన్ చేస్తున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియచేశారు మేకర్స్. ఊటీలో కూడా యాక్ష‌న్ ఎపిసోడ్స్ ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ సినిమాలో నాగార్జున గెట‌ప్, మేకోవ‌ర్ అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా టాకీ కంప్లీట్ కానుంది. ఆత‌ర్వాత సినిమా ఎప్పుడు రిలీజ్ చేయ‌నున్నారు అనేది ప్ర‌క‌టించ‌నున్నారు.

Also Read : దుబాయ్ లో ఘోస్ట్ షూటింగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్