Saturday, January 18, 2025
Homeసినిమాది ఘోస్ట్ హిందీ లో రిలీజ్

ది ఘోస్ట్ హిందీ లో రిలీజ్

నాగార్జున న‌టించిన  యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘ది ఘోస్ట్‘.  ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మూవీ టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ది ఘోస్ట్ మూవీ పై రోజురోజుకు అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఈమ‌ధ్య కాలంలో నాగార్జున న‌టించిన ఏ సినిమాకి రానంత‌గా ఈ మూవీకి బ‌జ్ క్రియేట్ అయ్యింది. దీంతో ‘ది ఘోస్ట్’ మూవీని తెలుగుతో పాటు త‌మిళ్, హిందీలో కూడా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న ‘ది ఘోస్ట్’ మూవీ రిలీజ్ చేయ‌నున్నారు. త‌మిళ్ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. అక్క‌డ‌కు టీమ్ వెళ్లి ప్ర‌మోట్ చేయ‌డం జ‌రిగింది కానీ… బాలీవుడ్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తామ‌న్నారు కానీ.. అక్క‌డ ప్ర‌మోష‌న్స్ చేయ‌లేదు. దీంతో అస‌లు ది ఘోస్ట్ మూవీ హిందీలో రిలీజ్ చేస్తున్నారా..?  లేదా..? అనేది ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. హిందీలో ఈ మూవీని అక్టోబ‌ర్ 5న కాకుండా… అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత అప్పుడు బాలీవుడ్ లో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేస్తార‌ని తెలిసింది. మ‌రో విష‌యం ఏంటంటే… బాలీవుడ్ లో ఈ సినిమాని నాగార్జునే స్వ‌యంగా రిలీజ్ చేస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం సౌత్ సినిమాల‌కు బాలీవుడ్ లో బాగా ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో ది ఘోస్ట్ మూవీకి కూడా అక్క‌డ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంద‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి.. ది ఘోస్ట్ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : క్లాస్ గా తీసిన పక్కా మాస్ సినిమా ‘ది ఘోస్ట్ ‘ : ప్ర‌వీణ్ స‌త్తారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్