Saturday, January 18, 2025
HomeTrending NewsHeavy Rains: గోదావరి తీర ప్రాంతాలకు భారీ వర్ష సూచన

Heavy Rains: గోదావరి తీర ప్రాంతాలకు భారీ వర్ష సూచన

గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే గాని ఇళ్ళ నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో పడతాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.

జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్