Saturday, November 23, 2024
HomeTrending Newsవిద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే

విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే

The Government Is Responsible For Student Suicides :

ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు… నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్‌ విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయని, కరోనా సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలంమైనదని విమర్శించారు. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. తమ చావుకు కారణం ప్రభుత్వం, కేటీఆర్ అంటూ స్వయంగా విద్యార్ధి ట్వీట్ చేయడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తల దించుకోవాలి.

గతంలో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు బలయ్యారని బండి సంజయ్ గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షల్లో ఫెయిలవడానికి ప్రభుత్వం బాధ్యత వహించి తీరాల్సిందనన్నారు. ఉచితంగా రీ వాల్యుయేషన్‌ చేయించాలని, ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుంది…అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకూ వెనుకాడబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్