Friday, March 20, 2026
HomeTrending Newsనిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం

నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయినప్ప టికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కలగానే మిగిలాయని, ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయటం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల మండలం పోరండ్ల గ్రామ సర్పంచ్ సంధ్యరాణి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో యువకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరగా MLC. జీవన్ రెడ్డి వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా MLC.టి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాల కొరకు…రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బిశ్వాల్ కమిటీ తన నివేదిక ద్వారా ఒక లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పెడిచేవిన  పెట్టి నిరుద్యోగులకు నిరాశ నిస్పృహలకు, ఆత్మహత్యలకు పాల్పడే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి  బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండమధు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, కౌన్సిలర్ జీవన్, మాజీ కౌన్సిలర్ రమేష్ రావు,బీరం రాజేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular