బిజెపి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు కానీ ఈరోజు రైతుల పై పెట్టుబడి భారం వేసిందన్నారు. BRS గజ్వేల్ నియోజకవర్గ ప్రతినిధుల సభకు ఈ రోజు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టి రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృధికి అడ్డుపడుతున్న గవర్నర్ ని నేను తెలంగాణ బిడ్డగా గట్టిగా ప్రశ్నిస్తున్నా అన్నారు.
గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని మంత్రి ఆరోపించారు. ఒక గులాబీ సైనికుడుగా ఉద్యమకారుడుగా మాట్లాడే హక్కు ఉంటుందని, ఈరోజు గజ్వేల్ కి రావాల్సిన ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు అడ్డుకొని గజ్వేల్ అభివృద్ధికి గవర్నర్ అడ్డుపడ్డారని ఆరోపించారు. ఎక్కడైనా అభివృద్ధి అంటే దేశానికి సంపద రావాలి బయట దేశాల్లో ఉన్నవారు తిరిగి మన దేశానికి రావాలన్నారు. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది కేంద్రంలో ఉన్న బిజెపి పోకడ వల్ల దేశంలో ఉన్న సంపద బయిట దేశాలకు తరలి పోతోంది. అదేవిధంగా దేశంలో ఉన్న పౌరులు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.