Thursday, January 23, 2025
HomeTrending Newsకుటుంబ పాలనను పెకిలిస్తాం - బండి సంజయ్

కుటుంబ పాలనను పెకిలిస్తాం – బండి సంజయ్

కేసీఆర్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. అప్పుడు కార్యకర్తలకు నేనొక్కటే చెప్పిన…. మీరేం భయపడకండి… ఢిల్లీ నుండి ఫోన్ చేసింది. పులి వస్తోంది. వేట మొదలైంది. వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి కార్యకర్తలను కాపాడే పులి. ఆ పులే చేవెళ్ల గడ్డకు వచ్చింది. ఆ పులికి అందరూ లేచి స్వాగతం పలికండి’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. చేవెళ్లలో జరిగిన ‘‘విజయ సంకల్ప సభ’’లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ, మధ్య ప్రదేశ్ ఇంఛార్జీలు తరుణ్ చుగ్, మురళీధర్ రావు, సహ ఇంఛార్జీ అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఆ వెంటనే అమిత్ షా సూచన మేరకు బండి సంజయ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

అందులోని ముఖ్యాంశాలు…

హిందీ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో నన్ను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారు. 8 గంటలు రోడ్ల మీదే తిప్పారు. కరీంనగర్ దాటినంక నా భార్య ఫోన్ చేసింది. ఢిల్లీ నుండి ఫోన్ చేశారని చెప్పింది. నన్ను కొత్తపేట, ప్రజ్ఝాపూర్, భువనగిరి తీసుకుపోతున్నరు.. అక్కడికి ఓ కానిస్టేబల్ వచ్చి… యాడికి తీసుకుపోతున్నరో అర్ధం కావడం లేదని… అప్పుడు నేను చెప్పిన… ఢిల్లీ నుండి ఫోన్ చేసింది. పులి వస్తోంది. వేట మొదలైంది. వెంటాడటం ప్రారంభించింది. కార్యకర్తలను కాపాడే పులి. ఆ పులే చేవెళ్ల గడ్డకు వచ్చింది. ఆ పులికి అందరూ లేచి స్వాగతం పలికండి (సభలో ఉన్న వేలాది మంది స్వచ్ఛందంగా లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు).

తెలంగాణను అభివ్రుద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం ఇక్కడికి వస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటోంది. ఒక్కసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. బీజేపీ అధికారంలోకి వస్తే అభివ్రుద్ధి చేస్తాం. పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. ఫసల్ బీమా అమలు చేస్తాం. ఇండ్లను నిర్మిస్తాం. జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తాం.

తెలంగాణలో రాక్షస రాజ్యాన్ని, కుటుంబ పాలనను, నియంత పాలనను కూకటి వేళ్లతో పెకిలించివేసేందుకు అమిత్ షా ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాం. మీ అందరూ ఆశీస్సులివ్వాలని కోరుతున్నా. లాఠీదెబ్బలకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఇంతపెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ రెండు చేతులెత్తి జోడిస్తున్నా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్