Saturday, January 18, 2025
Homeసినిమాబాబాయ్ డేట్ కి వస్తున్న కళ్యాణ్ రామ్.?

బాబాయ్ డేట్ కి వస్తున్న కళ్యాణ్ రామ్.?

బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘అఖండ’. డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందిన అఖండ చిత్రం గత సంవత్సరం డిసెంబర్ 2న విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్ సీస్ లో సైతం అఖండ భారీగా కలెక్షన్స్ సాధించడం విశేషం. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీని అఖండ రిలీజ్ డేట్ అయిన డిసెంబర్ 2న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కళ్యాణ్ రామ్ ఒక హిట్ సినిమా కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ ఏడాది ‘బింబిసార’ మూవీతో కళ్యాణ్‌ రామ్ బ్లాక్ బస్టర్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. కొత్త కథనంతో వచ్చిన బింబిసార ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ సీక్వెల్ కూడా త్వరలో పట్టాలెక్కనుంది. కళ్యాణ్ రామ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. ఇందులో ఒక సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఈ మూవీలో కళ్యాణ్‌ రామ్ ట్రిపుల్ రోల్ చేయనున్నారని టాక్. ఈ సినిమాకు ‘అమిగోస్’ అనే టైటిల్ ఖరారైంది.

రాజేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమిగోస్‘ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను బాలయ్య రిలీజ్ డేట్ అయిన డిసెంబర్ 2న విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తోంది. బాలయ్యకు కలిసొచ్చిన ఈ తేదీన కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. రిలీజు డేట్ పైనే త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక  బింబిసార మూవీతో మంచి ఫామ్ లో ఉన్న కళ్యాణ్ రామ్ కు అమిగోస్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్