Sunday, January 19, 2025
HomeTrending NewsBRS: బిఆర్ఎస్ ప్లీనరీ ప్రతినిథుల సభలో హైలైట్స్

BRS: బిఆర్ఎస్ ప్లీనరీ ప్రతినిథుల సభలో హైలైట్స్

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్లీనరీ సాయంత్రం 6.30 కు ముగిసింది. దాదాపు 7గంటలకు పైగా సాగిన సమావేశం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి ప్లీనరీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. వొక వైపు ఎండల తీవ్రత వుండడం మూలాన భారీ బహిరంగ సభను వరంగల్ లో అక్టోబర్ లో నిర్వహించాలని అధినేత సిఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఆహ్వానిత ప్రతినిధులతో సాగింది సమావేశం.
ఈ నేపథ్యంలో… పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాలను బలపరుస్తూ..తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన దశనుంచి…తెలంగాణ సాధన …స్వయం పాలనలో సాధించిన ప్రగతి గురించి సమావేశం లోతుగా చర్చించింది. పలు తీర్మానాలను ఆమోదించింది. మొత్తంగా టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ పార్టీగా పరిణామక్రమాన్ని, తెలంగాణ మోడల్ దేశానికి పరిచయం చేస్తూ దేశ ప్రజల సంక్షేమం కోసం బిఆర్ఎస్ పార్టీ చేపట్టవలసిన గురుతర బాద్యతలను సమావేశం చర్చించి సమ్మతిని తెలిపింది.
దేశాన్ని బాగుచేసేంతటి చారిత్రక సందర్భాన్ని దక్కించుకోవడం తెలంగాణ బిడ్డలుగా గర్వపడాల్సిన గొప్ప విషయమని ప్రతినిధులంతా ముక్తంకంఠంతో అధినేత కేసీఆర్ కు తమ సంఘీభావం తెలిపారు. తమంతా అధినేత వెంటనే నడుస్తామన్నారు. మత విద్వేషాలతో ప్రజలనడుమ విభజన రాజకీయాలతో దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న శక్తులను అడ్డుకోవడం వర్తమాన భారతదేశ రాజకీయాల్లో కేవలం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని సమావేశం స్పష్టం చేసింది. తెలంగాణ లో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే అందుకు మనసున్న దార్శనికతవున్న అధినేత సిఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని వక్తలు తమ ప్రసంగంలో స్పష్టం చేశారు.
ఆకట్టుకున్న గోరేటి రసమయి పాట మాట :
కాగా దళిత అభివృద్ధి ని కొనసాగిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి సిఎం కేసీఆర్ వెంట అడుగులేయాల్సిన అవసరమున్నదని, మత విద్వేషరాజకీయాలను తిప్పికొట్టాలంటే కేవలం కేసీఆర్ తోనే సాద్యమని ఎమ్మెల్సీ గోరేటి ఎమ్మెల్యే రసమయి తమ మాట పాట ద్వారా స్పష్టం చేశారు. తమదైన శైలిలో వారు తమ మాటతో పాటను కలిపి ప్రసంగిస్తున్నంత సేపు సభ ఆనందోత్సాహాల నడుమ ఆసక్తిగా విన్నది. చప్పట్లతో ఆమోదం తెలిపింది. వారి మాటలను అధినేత కేసీఆర్ కూడా అనునయిస్తూ సమర్థించారు.
కాగా…..ఆంద్రప్రదేశ్ బిఆర్ఎస్ అధ్యక్షుడు తమ రాష్ట్ర ప్రజలు సిఎం కేసీఆర్ వంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారని….అక్కడ కేసీఆర్ లేకపోవడమే లోపమని అన్నప్పుడు సభలో ఆసక్తి నెలకొన్నది.
అదే సందర్భంలో,,,పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మంత్రి కేటీఆర్ మాట్లాడినంత సేపు సమావేశంలో పిన్ డ్రాప్ సైలంట్. అనర్ఘలంగా సాగిన వారి వాగ్ధాటిని సిఎం కేసీఆర్ గారు కూడా వింటూ అనునయించారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరు దానివెనకవున్న తాత్వికత అధినేత అనుసరిస్తున్న విధానాలలో ఇమిడి వున్న మానవీయ కోణం దార్శనికత గురించి మంత్రి కేటీఆర్ గొప్పగా వివరించారు.
బిఆర్ఎస్ గా పరిణామం చెందడమనేది రేపటి తరానికి ఎంతో ఉపయోగకరంగా మారనున్నదని.. తెలంగాణ బిడ్డలుగా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం మన కర్తవ్యమని ప్రసంగిస్తున్నప్పుడు సమావేశం కరతాళధ్వనులతో మారుమోగింది.
అటు తెలంగాణ అస్తిత్వాన్ని ఇటు జాతీయ భావనలను తమ తమ ప్రసంగాలతో కొనసాగించిన సమావేశం…తెలంగాణ బిడ్డలుగా భారత పౌరులుగా రెండు విద్యుక్త ధర్మాలను కొనసాగించాల్సిన చారిత్రక బాద్యతను నేటి బిఆర్ఎస్ మొదటి ప్లీనరీ ప్రతినిధుల సమావేశం తీర్మానించింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్