Saturday, January 18, 2025
HomeTrending NewsAmerica visit: ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం - నిరంజన్ రెడ్డి

America visit: ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం – నిరంజన్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో ఎన్నారైల తోడ్పాటు అవసరమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాల్లో గత తొమ్మిదేళ్ళలో గమనార్హమైన మార్పు వచ్చిందని.. తెలంగాణకు బలమైన పునాది పడిందన్నారు. అమెరికా పర్యటనలో నాలుగో రోజు వాషింగ్టన్ డీసిలో తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటుచేసిన మీట్‌ అండ్ గ్రీట్‌ లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలు జయంత్ చల్లా, భువనేష్, రవి పల్లా, ఈశ్వర్ బండా తదితరులు

కంట్రోల్ బియ్యానికి ఎదురుచూసిన తెలంగాణ ఇవ్వాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నదని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఇవ్వాళ బియ్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటిందన్నారు. చిన్న కమతాల వల్ల ఫార్మ్ మెకనైజేశన్ కొంచెం క్లిష్టం. ఉబరైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ రావాలి. దాని దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినం. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు రావాలి. వాటిని రాష్ట్రం తరఫున ప్రోత్సహిస్తాం. వ్యవసాయ ఎగుమతులు ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు.

ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు మొదలైనాయని మంత్రి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఇస్తుందన్నారు. నూనె దిగుబడుల మీద కేంద్రం పెట్టే లక్షల కోట్ల రూపాయలు దేశీయ రైతులకు ఇస్తే, నాలుగేళ్లలో వంట నూనెల్లో స్వయం సమృద్ది సాధించగలమన్నారు.

ముందు చూపు లేని కేంద్రం వల్లనే బియ్యం విషయంలో గందరగోళం నెలకొందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు నెలల ముందు మా వద్ద సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయన్న కేంద్రం, ఇప్పుడేమో నిల్వలు లేవని ఎగుమతులు నిషేధం విధించిందని విమర్శించారు. తెలంగాణలో ఇవ్వాళ జీవ వైవిధ్యం తొణికిసలాడుతోందన్నారు. ఏ ఊరికి పోయినా టన్నుల కొద్ది చేపలు, రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో గొర్రెలు, కోళ్లు. తెలంగాణ గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించాయన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్