ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజుల పాటు జరిగేది బీఏసి సమావేశంలో నిర్ణయిస్తారు. సాధ్యమైనన్ని తక్కువ రోజుల్లో శాసనసభ సమావేశాలు ముగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విశ్వసనీయ సమాచారం.
ఈ సమావేశాల్లో సిఎం కెసిఆర్ ఇటీవల వివిధ వర్గాలకు ప్రకటించిన వరాలు.. వాటికి సంబందించిన బిల్లులకు సభ ఆమోద ముద్ర వేయించుకునే అవకాశం ఉంది. వానలు, వరదలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు చూస్తున్నాయి. శాసనసభ వర్షాకాల సమావేశాలు ఎన్నికల కొలహాలాన్ని తలపించే వాతావరణం నెలకొంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉండటంతో అన్ని పార్టీలు తమ వాణి వినిపించేందుకు శాసనసభ సమావేశాలను వాడుకుంటాయనటంలో సందేహం లేదు.