Saturday, March 14, 2026
HomeTrending NewsDrugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం...రేవ్‌ పార్టీ భగ్నం

Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం…రేవ్‌ పార్టీ భగ్నం

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అర్ధరాత్రి రేవ్‌ పార్టీని భగ్నం చేశారు నార్కోటిక్‌ బ్యూరో అధికారులు. డ్రగ్స్ సేవిస్తూ పలువురు సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. సినిమా ఫైనాన్సియర్‌ వెంకట్‌ను నార్కోటిక్‌ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢమరుకం, పూలరంగడు, లవ్‌లీ, ఆటోనగర్ సూర్య సినిమాలకు ఫైనాన్సియర్‌గా వెంకట్‌ పనిచేశారు. వెంకట్‌తో పాటు బాలాజీ, వెంకటేశ్వర రెడ్డి, మురళి, మధుబాల, మెహక్‌ను డ్రగ్స్‌ సేవిస్తుండగా రెడ్‌హ్యాండె‌డ్‌గా పట్టుకున్నారు నార్కోటిక్‌ బ్యూరో అధికారులు. నిందితుల నుంచి LSD, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం.. వారిని మాదాపూర్‌ పోలీసులకు అప్పగించారు. మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. సినిమా ఫైనాన్సియర్‌ వెంకట్‌తో పట్టుబడ్డ బాలాజీపై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. సినిమా ఫైనాన్సియర్‌ వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ జరిగినట్టు సమాచారం సేకరించారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వెంకట్‌ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్‌ బ్యూరో నిఘా పెట్టింది. వెంకట్‌కు డ్రగ్స్‌ పెడ్లర్లతో సంబంధాలపై ఆరా తీసింది. దీంతో.. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రగ్స్‌ పార్టీపై వాట్సప్‌లో వెంకట్‌ చాటింగ్‌ చేసినట్టు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular