Saturday, January 18, 2025
HomeTrending Newsబాలీవుడ్ హీరోలకు పాకిస్థాన్ అగ్ర తాంబూలం

బాలీవుడ్ హీరోలకు పాకిస్థాన్ అగ్ర తాంబూలం

 

బాలీవుడ్ లో అలనాటి అగ్ర హీరోలు దిలీప్ కుమార్, రాజ్ కపూర్ లకు పాకిస్థాన్ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తూ చర్యలు చేపట్టింది. పెషావర్ కు చెందిన ఈ ఇద్దరు అగ్ర హీరోల నివాసాల్ని మ్యూజియంగా తీర్చిదిద్దాలని పాక్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

శిథిలావస్థ లో ఉన్న నివాసాల్ని మరమ్మతులు చేసేందుకు ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు  తమ అధీనంలోకి తీసుకున్నారు. అగ్ర హీరోల రెండు ఇళ్ళ యాజమాన్య హక్కుల్ని పురావస్తు శాఖకు బదిలీ చేస్తూ పెషావర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. భవిష్యత్ తరాలకు గుర్తు ఉండేలా మ్యూజియం తయారు చేయాలనీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

గత ఏడాది సెప్టెంబర్ లోనే ఇద్దరు నటుల నివాసాల్ని మ్యూజియంగా మార్చాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రానికే చెందిన ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి  పదవి చేపట్టగానే రెండు దేశాల సంబంధాల్ని మెరుగు పరిచే కొన్ని చర్యలు చేపట్టారు. సిక్కు మతస్థుల ఆరాధ్య స్థలం గురుద్వారా దర్బార్ సాహీబ్  ఖర్తార్ పూర్ కారిడార్ ను కూడా ఇమ్రాన్ ఖాన్ త్వరితగతిన చేపట్టి పూర్తి చేశారు. దీంతో ఉభయ దేశాల సిక్కు ప్రజలు పాక్ ప్రధాని ఇమ్రాన్ పనితీరును ప్రశంసించారు.

భారత్ – పాక్ విభజన తర్వాత అనేక మంది ఇక్కడి వారు అక్కడికి, అటు నుంచి ఇటు వచ్చారు. అలా వెళ్ళిన వారి ఇళ్ళు, స్థలాలు అవసరం అయిన వారు స్వాధీనం చేసుకున్నారు. రెండు దేశాల్లో ఈ తతంగం జరిగింది. ఇప్పటికి హైదరాబాద్ తో సహా భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో కాందిశీకుల స్థలాలు అని ఉన్నాయి. తప్పుడు పత్రాలు సృష్టించి ఈ స్థలాలు కొందరు కబ్జా చేసుకోగా అనేకం న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్