Tuesday, November 26, 2024
HomeTrending NewsGolconda: త్వరలోనే పాలమూరు రంగారెడ్డి కాలువల పనులు - కెసిఆర్

Golconda: త్వరలోనే పాలమూరు రంగారెడ్డి కాలువల పనులు – కెసిఆర్

గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమర జవానుల స్మృతి చిహ్నం వద్ద ఘన నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు అమర వీరుల త్యాగాలను స్మరించుకుని…సందర్శకుల రిజిస్టర్ లో సంతకం చేశారు. ఆ తర్వాత గోల్కొండ చేరుకున్న సిఎం కెసిఆర్ ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకారం చేశారు. అక్కడి నుంచి రాణి మహల్ చేరుకున్న సిఎం కెసిఆర్ మహల్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తదనంతరం సిఎం కెసిఆర్ ప్రసంగిస్తూ తెలంగాణ ప్రస్థానాన్ని వివరించారు.

సిఎం కెసిఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు…

వజ్రోత్సవాల ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించుకున్తున్నాము. 77 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఎన్నో సాధించినా…అనుకున్న రీతిలో అభివృద్ధి సాగలేదు. ప్రగతి ఫలాలు అన్ని వర్గాలకు అందిన నాడే నిజమైన పండుగ. తెలంగాణ రాష్ట్రాన్ని శాంతియుత పద్దతిలో సాధించుకున్నాం.

రైతు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రానికి సాటి వచ్చే రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. పంట రుణాల మాఫీ, రైతు బంధు, రైతు భీమా, మిషన్ కాకతీయ తదితర కార్యక్రమాలతో రైతన్నకు అండగా ఉంది. రైతుల కోసం ప్రభుత్వం ఇంత చేస్తుంటే కొందరు వక్ర బుద్దితో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

పాలమూరు జిల్లా ప్రజల కష్టాలు తీర్చేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పతాకాన్ని చేపట్టాం. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ప్రభుత్వాన్ని అప్రతిశ్ర పాలు చేసేందుకు కేసులు వేసి ఆటంకం కలిగించాయి. ఆయినే ప్రభుత్వం పట్టుదలతో కుట్రలను ఎదుర్కొని ముందుకు వెళ్ళింది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇటీవలనే పర్యావరణ అనుమతులు వచ్చాయి. దీని ద్వారా మొదట తాగు నీటి కష్టాలు తొలగించి… రెండో దశలో సాగు నీటి కష్టాలు తీరుస్తామని హామీ ఇస్తున్నాను. పెద్ద అవరోధం తొలగినందున తొందరలోనే కాలువల పనులు ప్రారంభిస్తాం.

పేదలను ఆదుకునేందుకు గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టాము. ఈ పథకం ద్వారా నిరుపేదలు తమకు ఉన్న సొంత భూమిలో ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. ఇందుకు మూడు దశల్లో మూడు లక్షల రూపాయలు అందిస్తున్నాము.

దళిత బంధు పథకం ఈ రోజు దేశానికి దిక్సూచిగా నిలిచింది. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు పది లక్షల రుపాయుల అందిస్తోంది. దీన్ని పూర్తి గ్రాంటుగా ప్రభుత్వం ఇస్తోంది.

విద్యుత్ రంగంలో స్వాలంబన సాధించిన రాష్ట్రంగా తెలంగాణ చోదక శక్తిగా పనిచేసింది. గత సంవత్సరం పడిన భారీ వర్షాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది.

బీఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో వ్యవసాయ రంగం సుసంపన్నం అయింది. వ్యవసాయానికి మూడుగంటల విద్యుట్ చాలు అని కొందరు విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు.

నేతన్నల కోసం చేనేత మగ్గం పేరుతో కొత్త పథకం తీసుకొస్తున్నాము. నేతన్నలకు భారం కాకుండా అయిదు లక్షల భీమా అందిస్తోంది. పోడు భూములకు పరిష్కారం చూపించాం.

తెలంగాణ ఆర్టీసీ ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సిబ్బంది సంక్షేమం కోసం సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ బిల్లును అడ్డుకోవాలని కొన్ని శక్తులు ప్రయత్నించినా అసెంబ్లీ లో ఆమోదింప చేశాము.

ఇప్పటివరకు రెండు పీఆర్ సి ల ద్వారా ఉద్యోగులను ఆదుకున్నాము. singareni ఉద్యోగులకు ఈ సారి దసరా, దీపావళి బోనస్ గా వెయ్యి కోట్లు ఇవ్వనున్నాము.

అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన అధికారులకు పతకాలు అందించి సన్మానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్