Saturday, October 5, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందసరా అర్థం-పరమార్థం తెలియకపోతే ఎలా?

దసరా అర్థం-పరమార్థం తెలియకపోతే ఎలా?

తొలి కాన్పులో అబ్బాయే పుట్టాలని, రెండో సంతానంగా మాత్రమే అమ్మాయి కలగాలని కోరుకునే తల్లుల్లారా! మీకెందుకు దుర్గాపూజ?

తన కుమార్తె యుక్త వయసుకు వచ్చాక రుతుక్రమం వస్తుందనే ఆలోచనే అసహ్యమనుకునే, భరించలేని తండ్రులకు కామాఖ్య గుడిలో అడుగెట్టే అర్హత ఉందా?

తాము రాత్రంతా తిరిగి పార్టీ చేసుకుంటే పర్లేదు కానీ తన అక్క చెల్లెళ్ళు ఇంట్లోనే ఉండాలనుకునే అన్నదమ్ములు కాళరాత్రిలో తిరిగే కాళీ మాతని తలచుకుని భయపడాలి.

తనవాటా ఆహారాన్ని అన్నదమ్ములకు త్యాగం చేయమని ఆడపిల్లల్ని అడిగే బామ్మ చంద్రకాంత న్యాయం గుర్తు చేసుకోవాలి.

భార్యకు ఏమీ తెలీదని చులకనగా భావించే భర్త శివుని ఆగ్రహానికి సిద్ధపడాలి.

బార్లు బారా తెరచి ఉంచేది మగవారికోసమేనని, ఆడవారికి ప్రవేశం లేదని నమ్మే మగవారు రక్తం మత్తులో ఉన్న కాళికామాత పాదాల వద్ద శివుడు ఎందుకున్నాడో తెలుసుకోవాలి.

– బస్సుల్లో, రోడ్లపైన, పనిచేసే చోట మహిళలను వస్తువుల్లా చూసే మగవారు, ఆడవారిని తమ మాటలతో చేష్టలతో విసిగించడానికి గుంపు కట్టే మగవారు…

– ఇవేవీ చెయ్యకుండా సంస్కారిలా కనిపిస్తూ, మెత్తగా మాట్లాడుతూనే మహిళల ప్రేమని బలహీనతగా భావించే మగవారు…

– ప్రేమ పేరుతో మహిళ గౌరవాన్ని, మనసును కలుషితం చేసే మగవారు …
…. వీరెవరికీ దుర్గాదేవి పేరు ఎత్తే అర్హత లేదు.
వారు దీపం పెట్టకూడదు.
దుర్గాదేవి మంత్రాలు చదవకూడదు.
దేవి పేరిట ఉపవాసాలుండకూడదు.

వేదాలు, పురాణాల్లో ఎప్పటినుంచో ఉన్న ఫెమినిజాన్ని తరాలుగా అణచిపెట్టిన సంస్కృతి అంతమవ్వాలి.

అంతవరకు దుర్గాదేవి గురించి పట్టించుకోవద్దు.

( రచయిత తెలియని ఫేస్ బుక్ పోస్టుకు స్వేచ్ఛానువాదం)

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్