Saturday, March 14, 2026
Homeసినిమాహీరోయిన్స్ అంతా ఇలా చేస్తే బాగుంటుందేమో: హరీశ్ శంకర్  

హీరోయిన్స్ అంతా ఇలా చేస్తే బాగుంటుందేమో: హరీశ్ శంకర్  

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు – కృతి శెట్టి జంటగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి‘ సినిమా, ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్నరాత్రి నిర్వహించారు. నాగచైతన్య .. అడివి శేష్ .. డీజే టిల్లు .. అనిల్ రావిపూడి .. హరీశ్ శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ వేదికపై హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. “చాలా రోజుల తరువాత  నేను విన్న ఒక మంచి టైటిల్ ఇది. ఇంద్రగంటి గారికి సాహిత్యం పట్ల మంచి అవగాహన ఉంది. అందువల్లనే ఇలాంటి ఒక మంచి టైటిల్ పెట్టగలిగారు.

ఈ సినిమాలో హీరోయిన్ డైరెక్టర్ ను లవ్ చేస్తుందట .. నాకు ఈ పాయింట్ విపరీతంగా నచ్చింది. హీరోయిన్లంతా కూడా ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇందాక  ఐటమ్ సాంగ్ చూశాను .. చాలా బాగుంది. నాకు తెలిసి సుధీర్ ను అన్ని రకాలుగా వాడుకున్న డైరెక్టర్ ఇంద్రగంటి గారే. మొదటి నుంచి కూడా ఆయనను విభిన్నమైన పాత్రలలో  చూపిస్తూ వచ్చారు. డైరెక్టర్లు కూడా సుధీర్ అంత అందంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. సుధీర్ స్థాయికి తగిన సినిమా ఇంతవరకూ పడలేదనే అనుకుంటున్నాను.

సుధీర్ యాక్షన్ స్కిల్స్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే సినిమా ఇంకా రాలేదనే అనుకుంటున్నాను. ఆయనలోని నటుడిని ఇంద్రగంటిగారు బయటికి తీసుకుని వచ్చారు. ఆయనని పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా  చూడాలని మేమంతా కోరుకుంటున్నాము. కృతి శెట్టిని రెండు ఫంక్షన్లలో పొగిడాను. మళ్లీ ఇప్పుడు పొగిడితే డేట్లు దొరకవని పొగడటం లేదు. అందరూ కూడా చాలా రోజుల తరువాత ఒక మంచి తెలుగు సినిమాను చూడబోతున్నారనే విషయాన్ని నేను బలంగా చెప్పగలను” అంటూ ముగించాడు.

Also Read:ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి; ట్రైలర్‌ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular