Tuesday, March 10, 2026
Homeసినిమా'బ్రో' రియల్ టాక్ ఏంటి..?

‘బ్రో’ రియల్ టాక్ ఏంటి..?

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఫస్ట్ టైమ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ పై – డైలాగ్స్ అందించడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సంస్థకు ఇది 25వ చిత్రం కావడం విశేషం. అయితే.. భారీ అంచనాలతో ఈ రోజు బ్రో థియేటర్లోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు ఉండడంతో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అనే అనుమానాల మధ్య రిలీజైంది. అనుకున్నట్టుగానే ప్రీమియర్ షోలు లేకుండా ఉదయం ఆటలతో బ్రో థియేటర్లోకి వచ్చాడు.

ఇక సినిమా ఎలా ఉందంటే.. స్టోరీ లైన్ బాగుంది. పవర్ స్టార్ సినిమాకి ప్లస్ పాయింట్. సాయిధరమ్ తేజ్ కూడా పాత్రకు తగ్గట్టుగా బాగానే నటించాడు. అభిమానులు మెచ్చేలా తీశారు అనే టాక్ వచ్చింది. అలాగే ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ బాగుంది. ఈ సినిమాని ఒక్కసారి చూడచ్చు.. ఇలాంటి టాక్ వచ్చింది కానీ.. సినిమా అద్భుతం.. సూపర్ డూపర్ అనే టాక్ మాత్రం రాలేదు. కథ బాగున్నా.. కథనం మాత్రం స్లోగా ఉంది అంటున్నారు. మొత్తానికి అయితే.. బ్రో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. టైమ్ నేపథ్యంలో రూపొందిన బ్రో చిత్రానికి ఎందుకనో టైమ్ కలిసి రాలేనట్టువుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular